యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.
హైదరాబాద్ (గొల్లపల్లి) మే 15 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరించాలని కోరుతూ జగిత్యాల బిజెపి నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం బిజెపి రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల బీజేపీ నేతలు హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వివిధ సమస్యలపై చర్చించారు.
ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు అత్యంత ఇరుకుగా ఉండి అనేక ప్రమాదాలకు కారణమవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఎన్నికల్లో యావర్ రోడ్ విస్తరణ అంశాన్ని ప్రతి పార్టీ నాయకుడు లేవనెత్తి ప్రయోజనాలు పొందడం జరుగుతుందే కానీ ఏ ఒక్క నాయకుడు కూడా రోడ్డు విస్తరణ పై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యావర్ రోడ్ విస్తరణ కోసం కేంద్ర మంత్రి చొరవచూపి సమస్యను పరిష్కరించాలని కోరారు.సానుకూలంగా స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీనియర్ బిజెపి నాయకులు సిపెళ్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, ఆంకార్ సుధాకర్, చంద్రశేఖర రావు, కిషోర్ సింగ్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
