ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలి
సికింద్రాబాద్, ఏప్రిల్ 21 ( ప్రజామంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్, పట్లోళ్ళ సురేందర్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. సీతాఫల్మండి జీహెచ్ఎమ్సీ హాల్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకిదయాకర్, ఎల్.రమణ, నాయకులు వీ.హనుమంతరావు,తాడురి శ్రీనివాస్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.
ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు తో పాటు అన్ని సంక్షేమ పథకాలలో 20 శాతం, విద్యార్థి ఉద్యమకారులకు జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులపై ఉందని అన్నారు.
ఉద్యమకారులకు వచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పలువురు వక్తలు అన్నారు. కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ,లింగాని ప్రసన్న లక్ష్మీ,నాయకులు మల్లూరి అనిల్,గగన్ కుమార్,జానకి రెడ్డి,దయానంద్, పుట్నాల కృష్ణ,జగన్,వీరస్వామి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
