సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు):
ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులనుపంపిణీ చేశారు. గాంధీ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఐడీహెచ్ కాలనీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత కస్టమ్స్ భవన్ లో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. అమీర్ పేట లో ఎండ వేడిమి నుంచి ప్రజలు సేదా తీరేందుకు చలివేంద్రాలను ప్రారంభించారు. దాసారం బస్తీలో అన్నదానం నిర్వహించి, సనత్ నగర్ బస్టాప్ వద్ద పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ...తన పుట్టిన రోజున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ కోట నీలిమా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ లు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
