దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
హైదరాబాద్ మే 13(ప్రజా మంటలు)
యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది.
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ (27) అనే యువకుడి ఖాతా ద్వారా ఎవరో లావాదేవీలు జరిపినందున అజ్మాన్ లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది.
మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్, బేగంపేట ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకరించారు.
సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇంచార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
గల్ఫ్ దేశంలో జైలు పాలయిన మధుకర్ కు కాన్సులర్ (దౌత్య) సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు అభ్యర్తించారు. న్యూ ఢిల్లీ లోని భారత విదేశాంగ శాఖతో, దుబాయి లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుడిని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (న్యాయ సేవాధికార సంస్థ) కు కూడా పంపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
