దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

On
దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
వేములవాడ మే 14 ( ప్రజా మంటలు) 
 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముందుగా కొద్ది రోజులపాటు ఆలయంలో జరిగే పూజలు కోడే మొక్కులు తదితరాలు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామని భక్తులకు రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 27 కుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న ఆలయ సంరక్షణ సమితి పేరిట  బుధవారం వేములవాడ బందుకు పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి భక్తుల దర్శనాలను, పూజలు ,కోడె మొక్కులు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు .దేవాదాయ కమిషనర్ ,స్తపతి తదితరులకు ఆలయాన్ని ముసివేయకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలని వినతి తెలియజేశామని అన్నారు .ఆలయ విస్తీర్ణం ఎంతవరకు చేస్తారు అభివృద్ధి పనులు మార్పులు చేర్పులు ప్రభుత్వం భక్తులకు తెలియకుండానే ఏర్పాట్లు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అధికారులు మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం సరికాదని ఆగమశాస్త్రంలో దేవాలయ లోపల దర్గా ఉండడం సరైనదేనా ? అని ప్రశ్నించారు

1966లో దేవాదాయ శాఖ ఏర్పాటు జరిగిందని అంతకు ముందు నుండే 400 కుటుంబాల అర్చకులు నివేదనలు అన్న పూజ కావలసిన తమ ఇంటి నుండి తీసుకువెళ్లి పూజలు చేశారని గుర్తు చేశారు. ఆలయ ప్రసాదాల్లో నాణ్యత లేదని అదే విధంగా ధర్మగుండం నీళ్లు పరిశుభ్రంగా ఉండడం లేదని వాపోయారు .భక్తుల మనోభావాలను దృష్టి అందించుకోవాలని మాత్రమే మేము కోరుతున్నామని అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని అభివృద్ధి పేరిట ఆలయంలో ఉన్న పరివార దేవతలను తొలగించాలనుకోవడం ఎట్టి పరిస్థితులలో జరిగే పని కాదని తాము దాన్ని అడ్డుకుంటామని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయం చూస్తే ఇల్లు విప్పి పందిరి వేస్తుందా అన్న సామెతల ఉందని దేవాలయం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా చిరు వ్యాపారులతో కలిసి పదివేల కుటుంబాలు ఆధారపడి ఉంటున్నాయని వారిని బజారున వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో తిరుపతి ఏడుకొండలు కాదు రెండు కొండలు అన్న ముఖ్యమంత్రికి జరిగిన అనర్ధం అదేవిధంగా కంచి స్వామిపై దౌర్జన్యం చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితులు మననం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఇలాంటి సోదహరణాలను తెలుసుకోవాలన్నారు.

ఆలయ పనులు కొనసాగిస్తూనే భక్తులకు దర్శనాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపకూడదని అన్నారు. గతంలో కాశీ కారిడార్ నిర్మించినప్పుడు భక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణం చేశారని అంతే కాకుండా ఉజ్జయిని, అయోధ్యలో రామాలయ నిర్మాణం సమయంలో బాల రాముని ఉప ఆలయంలో ఉంచి పనులు కొనసాగించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే ధర్మ దర్శనానికి ఐదు నుండి 6 గంటల సమయం పడుతుందని దీని దృష్టి యందుఉంచుకొని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి దర్శనం చేసుకునే భక్తులకు తిరుపతి తదితర పెద్ద దేవాలయాల్లో ఉన్నట్లుగా కంపార్ట్మెంట్లలో ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఆగమశాస్త్రం పేరిట సనాతన ధర్మానికి విరుద్ధంగా ఆలయంలో పరివార దేవతలను తొలగిస్తామనడం సరికాదని ఈ విషయంపై ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా పౌరాణిక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో జరిగే అన్ని విషయాలు భక్తులకు కచ్చితంగా తెలుపాలని భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం అభివృద్ధి పేరిట మార్పుల చేర్పులపై పునరాలోచన చేసి భక్తులకు దర్శనాలను యధావిధిగా రాజన్న ఆలయంలోనే కొనసాగించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వద్ద నగదు నిల్వ లపై ప్రకటనలు చేశారని దేవాలయానికి సంబంధించిన డిపాజిట్లను ఎట్టి పరిస్థితిలో వినియోగించరాదని స్వామివారి బంగారు వస్తువులను కరిగించి అభివృద్ధి పనులకు వాడాలని చూస్తే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన అన్నారు .

ప్రస్తుతం ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు డిఏల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని 500 ఉద్యోగుల పరిస్థితిని ప్రభుత్వం గమనించి వారికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. దేవదా య శాఖపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని దేవాదాయ శాఖకు దేవుని ఆదాయం మాత్రమే కావాలని భక్తుల మౌలిక సదుపాయాలపై సంబంధం లేకుండా వ్యవహరించడమే దేవాదాయ శాఖ మూలసూత్రంగా మారిందని అన్నారు.
 

భక్తుల మౌనం అంగీకారం కాదని ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతే భగవంతుడు సైతం వారిని క్షమించడని గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. బందుకు సహకరించిన వర్తక వాణిజ్య వర్గాల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Tags

More News...

Local News 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి 

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి  గొల్లపల్లి మే 14  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె గ్రామంలో బి బి కే బొమ్మెన కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించే  క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి టాస్క్ వేసి బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఐపీ బిల్డింగ్ వెనుక అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి    సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు):: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (55-60 ఏండ్ల వయసు)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టర్లు...
Read More...
Local News 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ వేములవాడ మే 14 ( ప్రజా మంటలు)    దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఐదు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి .కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించారు....
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి గోవింద పల్లె చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు . బసంత్ ఠాకూర్ , తండ్రి: బల్ సింగ్ వయస్సు: 29...
Read More...
Local News 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్... 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...  జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేసి జైలు కు తరలించిన జగిత్యాల పట్టణ పోలీసులు                     జగిత్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో సోమవారం రాత్రి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్...
Read More...
Local News 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు సలహాల కోసం బుధవారం 14వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం పేరిట కార్యక్రమం జరుగును .    ఈ అవకాశాన్ని జిల్లా ప్రయాణికులు వినియోగించుకోవాలని సమస్యలు సలహాల కొరకు 99 59...
Read More...