శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు)
పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కాగా సోమ వారం తులాభారం ,పూలంగి సేవ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు.
తులాభారం కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ తులాభారంలోని పద్యాలు పక్కవాద్యాల సహకారంతో ఆలపించారు .ఈ పద్యాలు ఆహుతలను ఎంతగానో అలరించాయి. వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య నేతృత్వంలో కొనసాగాయి.
వైదిక క్రతువులలో దెబ్బట. వంశీధరాచార్యులు, కాండూరి శేషాచార్యులు, కాండూరి వెంకట రమణాచార్యులు, చిలకముక్కు సృజనాచార్యులు, మరింగంటి రోహితాచార్యులు ,నంబి. నృసింహాచార్యులు, వాసుదేవ ఆచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, నంబి రాంగోపాల్ ఆచార్యులు, పాలెపు వెంకటేశ్వర శర్మ, మహాదేవ శర్మ, తదితరులు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూలంగి సేవ ,తులాభారం కార్యక్రమం చూసి నేత్రానంద భరితులయ్యారు. వివిధ రూపాల్లో భక్తులు తమ స్వహస్తాలతో దీపాలు వెలిగించి దీపాలంకరణ చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై వివిధ రకాల పూలతో అలంకారం చేశారు .విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ ,ఆశీర్వచనం, చేసారు .ఆలయాన్ని సంప్రదాయ బద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
