నిర్లక్ష్యంగా లారీని నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడికి 18 నెలల జైలు శిక్ష, 5500 రూపాయల జరిమాన
*
జగిత్యాల ఫిబ్రవరి 21(ప్రజా మంటలు)
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం గ్రామానికి చెందిన గటికె కృష్ణమూర్తి అనే వ్యక్తి తేదీ 02-05-2018 రోజున పని నిమిత్తం రాయపట్నం నుండి ధర్మపురికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటలకు ద్విచక్ర వాహనం పై వస్తున్న క్రమంలో రామయ్య పల్లె బస్ స్టేజ్ వద్ద వెనుక నుండి AP 16 AY 0689 గల లారీ అతివేగంగా వచ్చి వెనుక నుండి కృష్ణమూర్తి ద్విచక్ర వాహన ఢీకొట్టగా కృష్ణమూర్తి తీవ్ర గాయాలయి అయి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ యొక్క ప్రమాదం సంభవించినదని తెలిసినా కూడా లారీ డ్రైవర్ జగిరి మల్లేశ్,26 సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడ ఆగకుండా వెళ్ళగా దీన్ని గమనించిన స్థానికులు లారీని వెంబడించి రాయపట్నం దగ్గర అపి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇట్టి విషయం గురించి గటికె కృష్ణమూర్తి బార్య అనురాధ ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
సాక్షులను విచారించిన జడ్జి శ్యామ్ ప్రసాద్, జె ఎం ఎఫ్ ఎస్ ధర్మపురి నిందితుడైన మల్లేష్ కు 18 నెలల జైలు శిక్ష, 5500/- రూపాయల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన అడిషనల్ పీపీ రాజేష్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, కోర్ట్ కానిస్టేబుల్ రాము ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)