గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి
అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)
జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు.
గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి, కర్ణాటక మహారాష్ట్ర లకు విస్తరించ తలపెట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి వెనుక బ్యాంకు సీ.ఇ.వో, సిబ్బంది కృషి, పట్టుదల వున్నాయన్నారు. భవిష్యత్తులో గాయత్రి బ్యాంకు మరింత అభివృద్ధిని సాధించాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న లీడ్ బ్యాంకు మేనేజెర్ రాంకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యల పరిష్కారంలో గాయత్రి బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్నారు. నిరార్ధక ఆస్తుల నిర్వహణలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరు అద్భుతం అని ప్రశంసించారు.
కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి కోపరేటివ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. కార్యక్రమంలో గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ జి.ఎం(అడ్మిన్) శ్రీలత, జిల్లా సహకార శాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుజాత, సహకార శాఖ సిబ్బంది, గాయత్రి బ్యాంకు ఖాతాదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
