రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు.
సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి ఇంధారపు బండయ్య నిర్వహణలో సమావేశమై, విశ్రాంత విద్యాశాఖాధికారి, తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ పూర్వ కార్యదర్శి కీ.శ. శ్రీ రొట్టె బాలకిష్టయ్య మరణం తీరని ఆవేదన వ్యక్తం చేశారు.
రొట్టె బాలకిష్టయ్య వృష నామ సంవత్సర పుష్య శుక్ల పక్ష షష్ఠి (23-12-1941, మంగళ వారం) నాడు పురాణ ప్రవచన పాండిత్యంలో ప్రసిద్ధి గాంచిన రొట్టె చంద్రశేఖర శాస్త్రి, యమునమ్మ దంపతులకు కనిష్ఠ పుత్రునిగా జన్మించారని, చిన్న వయసులోనే వినయశీలత, క్రమశిక్షణ, కర్తవ్య నిష్ఠలను ఆచరణలో చూపిన ఆయన, ఆ లక్షణాలతోనే ఉద్యోగ జీవితంలోనూ గుర్తింపు పొందారన్నారు.
బాలకిష్టయ్య తొలి నియామకంగా ఆనాటి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని విద్యాశాఖలో విధులు ప్రారంభించారని, అనంతరం కరీంనగర్ జిల్లాకు బదిలీ కాగా, జగిత్యాలలోని పురాతనోన్నత పాఠశాలలో కొంతకాలం అంకితభావంతో సేవలందించారన్నారు. ఆయన కృషి, కార్యదక్షతను గుర్తించిన అధికారులు ఆయనను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారని, అక్కడి నుంచీ పదోన్నతుల మార్గంలో అదిలాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, ఆపై వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి, తరువాత కాకినాడ ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అయ్యారని వివరించారు. సహాయ సంచాలకులుగా కృషి చేసి తిరిగి వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి బదిలీ అయ్యి, 31-12-1999 న పదవీ విరమణ చేశారన్నారు.
ఉద్యోగ జీవనమంతా ఆయన సన్మార్గం, సేవాభావం, సహచరుల పట్ల సహకార దృక్పథంతో నిండి ఉండేదని, సేవా నియమాలపై లోతైన అవగాహన కలిగి, అనేకమంది ఉద్యోగులకు సలహా, మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందించారు. కొంతమందికి ఉద్యోగావకాశాలు దక్కేలా చేయూతనిచ్చారని, అందువల్ల ఆయన సహచరులందరి అభిమానాన్ని చూరగొన్నారన్నారు.
కుటుంబ పరంగా ఆయన ఒక పుత్రుడు, ఒక పుత్రికలను సద్గుణవంతులుగా తీర్చిదిద్దారని, పిల్లల విద్యాభ్యాసం, అభివృద్ధి పట్ల అపారమైన శ్రద్ధ కనబరచి వారిని ఉత్తమ స్థితిలో నిలిపారు. అయితే సహధర్మచారిణి వియోగం ఆయనకు తీవ్ర మానసిక దుఃఖాన్ని కలిగించిందని, వయోభారంతో పాటు ఆ దుఃఖం కూడా ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని, కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన 06-10-2025 సోమవారం నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి శ్రీ నృసింహునిలో ఐక్యమయ్యారని వివరించారు.
తన జీవితానంత్య దశలో కుటుంబ సభ్యులందరూ విశేషమైన సేవలు అందించడం ప్రశంసనీయమైనదని, ఆయన సేవా నిబద్ధత, సహృదయత, సత్సంగత మన సంఘానికి ఆదర్శప్రాయమైనవిన్నారు. 2006 నుండి 2014 వరకు మూడు పర్యాయములు రిటైర్డ్ సంఘ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి సంఘానికి విశేష సేవలు అందించారు. ఆయన మరణం మన సంఘానికి తీరనిలోటన్నారు.
రొట్టె బాలకిష్టయ్యకు శ్రీ నృసింహసాన్నిధ్యం కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మనసారా ఆ లోకపాలుడు నారసింహుని మన సంఘం తరపున ప్రార్థిస్తు మన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్నారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)
కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
