జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 13(ప్రజా మంటలు)
పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఉపాధ్యాయులతో స్టాఫ్ రూం లో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థినుల అభ్యాసం,హాజరు,తదితర సౌకర్యాలపై అధ్యాపకులతో చర్చించి,పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.పాఠశాలలో వసతులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాఠశాలలో
వాటర్ సమస్య,డ్రైనేజీ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ,డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అధికారులతో మాట్లాడానని త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.నీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు చెట్పల్లి సుధాకర్ ,చందా పృథ్వీ,బోయినపల్లి ప్రశాంత్ రావు,మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్,ప్రిన్సిపాల్ కవిత,ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)