హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..
సనాతన ధర్మం ఎంతో గొప్పది..దానిని పరిరక్షించడం ప్రతి హిందువు బాధ్యత
స్కందగిరి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) :
భారత దేశంలో సనాతన ధర్మం ఎంతో గొప్పదని,దానిని పరిరక్షించడం ప్రతి ఒక్క హిందువు బాద్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో హిందుత్వం ఉన్నంత కాలమే సెక్యులరిజం అనేది ఉంటుందన్నారు.ఒకవేళ హిందూ మతం మైనార్టీ లో పడితే సెక్యులరిజం అనేది ఉండదని వ్యాఖ్యలు చేశారు. హిందు మతం గురించి మాట్లాడితే ఇతర మతాలను కించపరిచినట్లు కాదన్నారు. స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్య స్వామి ఆలయంలో జరిగిన శ్రీతెలంగాణ వేద విద్వాన మహాసభకు ఆదివారం కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనేక వేల సంవత్సరాల నుంచి భారత దేశ గడ్డమీద సనాతన ధర్మం, హిందూ మతం ఉందన్నారు, భవిష్యత్ లో కూడ ఉంటాయన్నారు. ఈసందర్బంగా సభలో పాల్గొన్న వేద పండితులను కేంద్ర మంత్రి సత్కరించారు. అక్కడున్న వేదవిద్యార్థులను పలకరించారు. ఆలయంలోని శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకొని , వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)