అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి
సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది పై కొంతమంది దుండగులు శుక్రవారం రోజున,విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.హస్మత్ పెట్ సర్వే నెంబరు 1 వద్ద ఛత్రిగడ్డ స్థలంలో ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన తో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గుర్తు తెలియని దుండగులు,కొందరు మహిళలు పరుగులు పెట్టిస్తూ విచక్షణ రహితంగా దాడి చేశారు.
తన పేరిట ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో అడిగేందుకు వెళ్లిన అడ్వకేట్ మొయిజుద్ధిన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకొని దుర్భాషలాడుతూ ఆయనపై చేయి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో అడ్వకేట్ మొయిజుద్ధిన్ ఖాన్ కు గాయాలు కాగా, అతని వాహనాన్ని సైతం లక్ష్యంగా చేసుకొని గ్రానైట్ రాయితో కారు అద్దాలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మొయిజుద్ధిన్ ఖాన్ అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మొయిజుద్దిన్ మాట్లాడుతూ తన స్థలాన్ని కబ్జా చేసి, గుండాలతో దాడి చేయించారని ఆరోపించారు.భూ యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని, న్యాయస్థానాల నుండి తమకే అనుకూల తీర్పు ఉన్నపటికీ కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రోద్భలంతో గుండాలను మోహరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ భూ వివాదంలో కాల్పుల దాడులు జరిగాయని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని తెలిపారు.
కోర్టు యాజమాన్య హక్కులన్నీ ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో పోలీసులు తమకు సహకరించట్లేదని ఆరోపించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తనపైనే మహిళలు,గుండాలతో దాడులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ,పోలీసులు,అధికారులు ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
.jpg)
పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అండ

జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
