శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి
తుంగతుర్తి అక్టోబర్ 12 (ప్రజా మంటలు):
ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం అత్యంత బాధాకరం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అర్పించారు.
❇️నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ -2 ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు తరలించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 ప్రారంభమయ్యేలా పోరాటం చేశారు. అందువల్ల ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడం వారికిచ్చే నిజమైన నివాళి...” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)