వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు
జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు):
వృద్ధుల్లో మనో నిబ్బరం నింపేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసో సియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజెన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల్లో ఆత్మహత్య ల నివారణ-పిల్లల భాద్యత అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలను వివరించారు. రాష్టం లో వృద్ధులు ఎక్కడ ఆత్మ హత్యలు చేసుకున్నా వెంటనే విచారణ జరిపించాలన్నారు.
తల్లిదండ్రులైన వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడకుండా పిల్లలు భాద్యత వహించాల న్నారు. స్వంత ఇంటిలో నుంచి గెంటి వేయడం, వృద్ధులను వసతి గృహాల్లో, అనాధ శరణాలయాల్లో చేర్పించడం, ఆస్తులను బలవంతంగా, మాయ మాటలతో రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా పోషించక పోవడం తోనే తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని వాటి నివారణకు సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర అధ్యక్షులు పి. నర సింహా రావు సూచనల్తో రాష్ట్ర వ్యాప్తముగా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నామన్నారు.
వృద్ధుల్లో ఆత్మహత్యల నివారణకు జిల్లా, డివిజన్ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్యులను నియమించాలని కోరారు.ఈ సదస్సులో మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. ఆర్. దేశాయ్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాతం, కోశాధికారి వెల్ ముల ప్రకాష్ రావు, కౌన్సిలింగ్ అధికారులు పీ. సీ. హన్మంత్ రెడ్డి, విఠల్, పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు ధోనూరి భూమాచారి, కస్తూరి శ్రీమంజరి, గంగము జలజ, కరుణ తది తరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
