లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామంలో లయన్స్ క్లబ్ గొల్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
గొల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ముస్కు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి ప్రారంభించారు.
కంటి వైద్య శిబిరానికి వివిధ గ్రామాల నుంచి నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు 85 హాజరు కాగా పరీక్షలు నిర్వహించి ఇందులో 50 మందిని కంటి ఆపరేషన్ల కోసం లయన్స్ క్లబ్,రేకుర్తి కంటి ఆసుపత్రి బస్సులో తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముసుకు కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన కుమార్,కార్యదర్శి సాయిని నరహరి, సభ్యులు నిశాంత్ రెడ్డి ,భీమ సంతోష్, వెంకటస్వామి, బల భక్తుల కిషన్, గంగారెడ్డి, బోల్లం రమేష్, ఎర్ర సంపత్, చాడ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)