జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు
హైదరాబాద్ అక్టోబర్ 11:
హైకోర్టు జీవో 9 పై స్టే విధించడంతో ఏర్పడ్డ పరిస్థిల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కొరకు,తెలంగాణ జాగృతి బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శుక్రవారం రోజున సమావేశం అయ్యారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జీవో 9 పై హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ జారీ చేయడం, బీసీ రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహం, ఉద్యమ కార్యాచరణ సహా పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుడు రామ్ కోటి చేరిక*
ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి తెలంగాణ జాగృతి లో చేరారు
బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు
జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది... అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది.ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ. 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలని కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది.. అడబిడ్డలకు కిట్ ల సాధన కోసం ప్రభుత్వం పై కొట్లాడాలి.పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు. దాని కోసం మనం కొట్లాడాలని కోరారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి. దాని కోసం కొట్లాడాలి. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి. జాగృతి అంటేనే పోరాటాల జెండా.. జాగృతి అంటేనే విప్లవాల జెండా. ఒక్కటి కాదు రెండు కాదు అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామణి అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
.jpg)
పేదింటి విద్యార్థిని చదువుకు తెలంగాణ జాగృతి అండ

జీవో 9 స్టే పై బిసి నాయకులతో కల్వకుంట్ల కవిత చర్చలు

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
