ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు):
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రంలో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని, అయితే వారిని ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈ పీ ఎఫ్, ఈ ఎస్ ఐ వంటి సౌకర్యాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతో పాటు దాదాపు 20శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నారని, పైగా ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని చిన్నారెడ్డి సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వ పరంగా నూతనంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చిన్నారెడ్డి ఆ లేఖలో వివరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 2023 కంపెనీస్ యాక్ట్ 8 ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
