బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.
కాలిఫోర్నియాలో బాతిక్ చిత్రకళ ప్రదర్శన
*సిద్దిపేట బాతిక్ సొసైటీ పేర శిక్షణ
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సాంస్కృతిక శాఖ (కళ నిధి) ఆధ్వర్యంలో తెలంగాణ కళలను మరియు తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతూ ,భావి తరాలకు తెలంగాణ విలువైన సంపదను అందించాలనే దృడ సంకల్పంతో ప్రత్యేక ప్రాచుర్యం పొందిన బాటిక్ చిత్రలేఖ కళ ను టిడిఎఫ్ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ , డబ్లిన్ ప్రాంతంలో బాటిక్ హస్త కళలైనా చిత్రాలను TDF- –USA వేదిక మీద టిడిఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ, టిడిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి చేతుల మీద ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజు యాసాల ఈ బాటిక్ హస్త కళ ల గురించి అక్కడికి విచ్చేసిన టిడిఎఫ్ సభ్యులకి మరియు వివిధ ఎన్ఆర్ఐ సభ్యులకి వివరించారు, ముఖ్యంగా తెలంగాణ కళ లైన బతుకమ్మ అదేవిధంగా తెలంగాణ సంబంధించిన వివిధ కళాఖ ఖండాలను చిత్రలేఖనంలో చూపించడం చాలా సంతోషకరమైన విషయమని టిడిఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ తెలిపారు అదేవిధంగా బాటిల్ హస్త కళ కు జియో ట్యాంకింగ్ ఏర్పాటుకు TDF –USA ద్వారా కృషి చేస్తారని వారు తెలిపారు.
తెలంగాణ కళ ల ను మరియు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉద్దేశంతో బాటిక్ కళ ను తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహిస్తున్న బాటిక్ కళాకారులైన యాసాల ప్రకాశ్, మమత లకు టి డిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో TDF ద్వారా యువతకు ఈ బాటిక్ కలలపై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించినట్టు వారు తెలిపారు.
తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల్లో బాతిక్ కళ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ కళ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియా నుండి భారతదేశానికి చేరింది. ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ కుమార్తె ఈ బాతిక్ చిత్రకళను భారతదేశంలో మొదటగా కలకత్తా శాంతినికేతన్ పాఠశాలలో పరిచయం చేశారు. తరువాత 1966లో, శాంతినికేతన్ విద్యార్థులైన జగదీశ్ మిట్టల్ మరియు కమలా మిట్టల్ దంపతులు ఈ బాతిక్ కళను అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేశారు. ఈ కళను ఆ సమయంలో లక్ష్మాగౌడ, సూర్యప్రకాశ్, గౌరీశంకర్, కాపు రాజయ్య, బాలయ్య వంటి పలువురు కళాకారులు నేర్చుకున్నారు.
వారిలో యాసాల బాలయ్య గారు తనదైన శైలిని అభివృద్ధి చేసి, సుమారు 35 సంవత్సరాల పాటు బాతిక్ చిత్రకళను పరిపుష్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇలా బాతిక్ కళ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఓ విశిష్టమైన స్థానాన్ని సంపాదించి, నేటికీ ఆ కళాత్మక ప్రకాశాన్ని కొనసాగిస్తోంది. ఎన్నో ప్రదర్శనలు మరియు శిక్షణలు ఇవ్వడం జరిగింది. నేషనల్ అవార్డును శంకర్ దయాళ్ శర్మ ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం యాసాల ప్రకాష్ (బాలయ్య గారి చిన్న కుమారుడు) ఈ బాతిక్ చిత్రకళను కొనసాగిస్తూ, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాతిక్ చిత్రకళ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ చిత్రకళ ప్రదర్శనను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించి మెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ దావోస్ వ్యాపార సమావేశానికి బాతిక్ పెయింటింగ్‌ను గౌతమ్ అదానీ కి అందించడం జరిగింది. సిద్దిపేటలో బాతిక్ చిత్రకళ అభివృద్ధి కోసం "సిద్దిపేట బాతిక్ సొసైటీ" పేరిట అనేకమంది ఆర్ట్ ఆసక్తిగల యువతకు యాసాల మమత ఆధ్వర్యంలో బాతిక్ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.అదేవిధంగా *saibatiks.com* వెబ్‌సైట్‌ను విజయదశమి 2025 నాడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యాసాల ప్రకాష్ తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తూ, గిరిజన విద్యార్థులకు కళతో పాటు బాతిక్ చిత్రకళను కూడా బోధిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)