గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
సికింద్రాబాద్ అక్టోబర్10 (ప్రజా మంటలు) :
అదుపు తప్పిన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించుకుంటే సమస్యలను ఎదుర్కొనే సత్తా సాధించగలమని పలువురు మానసిక వైద్యనిపుణులు సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని గాంధీ సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పలు అవగాహన కార్యక్రమాలు, చైతన్యర్యాలీ చేపట్టి, ప్లాస్‌మాబ్, నృత్యరూపకాలను ప్రదర్శించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణిలు ముఖ్య అతిథులుగా హజరై మాట్లాడారు.
శారీరక,మానసిక, సామాజిక ధృఢత్వంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. మనదేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక ఇబ్బందికి గురవుతున్నారని, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వలన ఎక్కువ మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని వివరించారు.
యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాబ్లింగ్ తదితర వ్యసనాలు విపరీతంగా పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్యసేవల లభ్యత’ నినాదంతో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డబ్లు్యఎఫ్‌ఎంహెచ్) ఈ ఏడాది ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
అనంతరం గాంధీ ప్రాంగణంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాన్ని అవిష్కరించారు. వైద్యవిద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆహుతులను ఆలోచింపజేసింది. కార్యక్రమంలో గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ వాణి, గాంధీ సైకియాట్రి విభాగ ఇంఛార్జీ హెచ్‌ఓడీ డాక్టర్ అనుపమ, వైస్ ప్రిన్సిపాల్స్ రవిశేఖరరావు, రాజారామ్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రోజారాణి, నర్సింగ్ సూపరింటెండెంట్స్ పద్మ, విద్యావతి, వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
