కంటోన్మెంట్ ను జీహెచ్ఎమ్సీ లో విలీనం చేయండి. - ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి
లేదా...కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలైనా జరపండి...
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):
కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని లేదా బోర్డు ఎన్నికలైనా జరపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వినతిపత్రం ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ,పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసిలో విలీనం చేయాలని, విలీనం ఆలస్యం అయితే కనీసం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలన్నా నిర్వహించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పరిపాలన మూలన పడిందని, ప్రజల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే శ్రీగణేష్ హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఈ సమస్యతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని, పేద ప్రజలు నివసిస్తున్న భూములను బదలాయింపు చేసి ఆ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు కు చెల్లించాల్సిన రూ.1000 కోట్ల ఆర్మీ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, తద్వారా నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న కంటోన్మెంట్ బోర్డు కు జవజీవాలు అందించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ రాజ్నాధ్ సింగ్ కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
