ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు
మెడికవర్ ఆర్ధోపెడిక్ సర్జన్ డా.కామిశెట్టి సతీష్ కుమార్
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) :
మోకాళ్లు, భుజాలు, మణికట్టులు వంటి కీళ్ల నొప్పులు వృద్ధులకు మాత్రమే పరిమితం కావని, ఇప్పుడు యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. వ్యాయామం లోపం, అధిక బరువు, మానసిక ఒత్తిడి కారణంగా ఆర్థరైటిస్ కేసులు అధికమవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 18 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. కీళ్ల వాపు, నొప్పి, గట్టిపడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలని మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కామిశెట్టి సతీష్‌కుమార్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...తొలిదశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చని అన్నారు. తగిన బరువును కాపాడుకోవడం, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, స్వచ్ఛందంగా మందులు వాడకపోవడం వంటి అలవాట్లు వ్యాధి నియంత్రణలో సహాయపడతాయి అని ఆయన అన్నారు.
ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా కీళ్ల పునరుద్ధరణ శస్త్రచికిత్సలు చేయించుకోవడం వల్ల రోగులు మామూలు జీవితం గడపగలరని వైద్యులు తెలిపారు. తొలిదశలో గుర్తింపు, సరైన అవగాహన, జీవనశైలి మార్పులు ఇవే ఆర్థరైటిస్‌పై గెలుపు సాధించే కీలకాంశాలని పేర్కొన్నారు. కీళ్ళు,మోకాళ్ళు,భుజాలు తదితర నొప్పులకు సొంతంగా మందులు కొనుక్కోని వాడటం చేయవద్దని, సంబంధిత వైద్యుడిని కలసి సరైన వైద్యం పొందాలని వైద్యులు సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)