టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజామంటలు):
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ఆదివారం రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ,సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ నరేందర్ గరిడి పాల్గొన్నారు.
ఈ ప్రాసెసింగ్ యూనిట్ ని తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు రైతు కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళలు కలిసి స్థాపించారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని టీడిఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్ వారి ఆర్థిక సాయంతో స్థాపించారు. ఈ సందర్భంగా టీడిఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు శ్రీనివాసులు మణికొండ ను టిడిఎఫ్ యూఎస్ఏ అట్లంట చాప్టర్ సభ్యులైన స్వాతి సూదిని , తోట గణేష్ ,వాణి గడ్డం లను సంస్థ సభ్యులు అభినందించారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనిత చేత ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మహిళల స్వాలంబన కొరకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎంతో కృషి చేస్తున్నట్టు ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి గారు తెలిపారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మహిళలు వాళ్ల కాళ్లపై వాళ్ళని చూడడానికి అనేక రంగాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషన్ పైన శిక్షణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు శిక్షణతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరియు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అదేవిధంగా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కావలసిన సదుపాయాలు ఈ సంస్థ ద్వారా సహకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలు మారకంటి భవాని మాట్లాడుతూ మహిళలు ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్, సుభిక్ష టీం సభ్యులు, తరిగొప్పుల మండల కేంద్రంలో గల వివిధ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం
