అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం
నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు
సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) :
టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌పోలీసులు, తిరుమలగిరి పోలీసులతో కలిసి భారీగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.45 లక్షల విలువైన వివిధ రకాల పేలుడు పటాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి టీచర్స్‌కాలనీలో దుర్గా ఏజెన్సీ పక్కన ఉన్న గోదాంలో అభిమన్యు కుమార్‌శర్మ (54) అనే వ్యక్తి అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో పేలుడు పటాకులు నిల్వ ఉంచుతున్నాడని సమాచారం అందింది. వెంటనే టాస్క్ ఫోర్స్‌బృందం దాడి చేసి అతన్ని పట్టుకుని గోదాంలో ఉన్న మొత్తం 250 కార్టన్ల పటాకులను స్వాధీనం చేసుకుంది. ఆయన వద్ద లక్ష్మీ బాంబులు, రాకెట్లు, కలర్‌ఫ్లవర్‌పాట్స్, బిజిలీలు, షాట్స్, స్పార్కిల్స్‌వంటి పటాకులు పెద్ద మొత్తంలో దొరికాయి. చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లేకుండా నివాస ప్రాంతంలోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం ద్వారా స్థానికుల ప్రాణాలకు ముప్పు కలిగించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నంబర్258/2025 కింద BNS సెక్షన్లు 288, 125, 223 మరియు Explosives Act 9B(1)(b) ప్రకారం కేసు నమోదు చేసి , నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాడి ఆపరేషన్ ను హైదరాబాద్‌సిటీ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైవీఎస్ సుధీంద్ర ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌ఇన్‌స్పెక్టర్‌కె. చంద్రశేఖర్, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్‌సి. నాగరాజు, ఎస్‌ఐలు పి.జ్ఞానదీప్, డి.కరుణాకర్‌పర్యవేక్షణలో నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)