ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి
జగిత్యాల అక్టోబర్ 10(ప్రజా మంటలు)
ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్ లో సభ్యత్వం కల్పిస్తాం
టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
టియూడబ్ల్యూజే ఐజేయు లో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు.
జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల జగిత్యాల పట్టణ ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టియూడబ్ల్యూజే ఐజేయులో సభ్యత్వ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు సభ్యత్వం కల్పిస్తామన్నారు. నవంబర్ 10 లోపు జిల్లాలో సభ్యత్వం పొందిన జర్నలిస్టులందరికీ ఐడి కార్డులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు ప్రతి సభ్యుడు తోడ్పడాలని సూచించారు.
ధర్మపురి, కోరుట్ల పట్టణాల్లోని ప్రెస్ క్లబ్ ల సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళామని, వారి ఆదేశాల మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఉప కమిటీలను త్వరలోనే ఎన్నుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన లోక రమణా రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షునిగా నియమిస్తూ కమిటీ తీర్మాణించింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగుల గోపాల చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరేపు రాజ్ కుమార్, చింత నరేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
