మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు అయిన ఆయన మాట్లాడుతూ, రోజు, రోజుకి పెరుగుతున్న యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక రోగులకు మరియు వికలాంగులకు చట్టపరమైన అనేక హక్కులు ఉన్నాయని, వారిపై వివక్ష చూపితే చట్ట ప్రకారం శిక్షార్హులు అని వివరించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
