రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు):
రాష్ర్టంలోని వేద పాఠశాలల అభివృద్దికి ప్రభుత్వ సహాకారం తప్పకుండా ఉంటుందని, పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తామని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీజనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ వేద విద్వాన మహాసభకు ఆమె శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పాఠశాలలను ఏర్పాటు చేసి,వేద పండితులను తీర్చిదిద్దుతున్న శ్రీ జనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ నిర్వాహకులను ఆమె అభినందించారు.
ఈసందర్బంగా మంత్రి అక్కడున్న వేదపాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ...యాదగిరి గుట్టలో కంచికామకోటి పీఠం సహకారంతో వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. బాసర, వరంగల్, వేములవాడ లోని వేదపాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామన్నారు. వేద పాఠశాల విద్యార్థులకు స్కాలర్ షిప్లు, బోజన సౌకర్యానికి కృషి చేస్తామని, వారిని ప్రోత్సహిస్తామన్నారు. స్కందగిరి ఆలయ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మాణ్యం, ఫౌండర్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి, మహాసభ నిర్వాహకులు తూములూరి సాయినాథశర్మ, బ్రహ్మానందశర్మ, జేఎన్రావు,జయశంకర్ పాల్గొన్నారు.
స్వామీజీని కలిసిన బీజేపీ ప్రెసిడెంట్:
శుక్రవారం రాత్రి స్కందగిరి ఆలయాన్ని రాష్ర్ట బీజేపీ ప్రెసిడెంట్ రామచందర్ రావు, ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ సందర్శించారు. ఈసందర్బంగా వారు తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామిని కలసి, ఆశీర్వచనం తీసుకున్నారు. హైకోర్టు జడ్జీలు,ఆలయ అధికారులు, సిబ్బంది, వేద విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
