రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన
సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు) :
దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు శుక్రవారం రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అఖిల భారత రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా పింఛనర్లు సికింద్రాబాద్ లోని రైల్‌నిలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు.పెన్షన్ బిల్లు రద్దు చేయాలని, 8వ వేతన సంఘం వెంటనే ఏర్పాటు చేయాలని, పెన్షన్ కమ్యూటేషన్ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని, పింఛనర్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
నాయకులు యుగేందర్, శివకుమార్, సుధాకరరావు, స్వామి, బాబురావు, పి.వి. లూ, పూర్ణరావు తదితరులు ప్రధానమంత్రిని కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు వివరించి, ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.రైల్వే పింఛనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి గౌరవం, భద్రత కల్పించాలని ఏఐఆర్ఆర్ఎఫ్ నాయకులు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ కి డిమాండ్ల పత్రాన్ని సమర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
