మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 10(ప్రజా మంటలు)
మెటా ఫండ్ ప్రో అనే నకిలీ యాపులో ప్రజలతో పెట్టు బడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేసిన కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఎస్పీ వివరాలను వెల్లడించారు.
మెటా ఫండ్ ప్రో అనే అప్ ను క్రేయేట్ చేసి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షల రూపాయలు వస్తాయని, అదేవిదంగా ఎక్కువ మందిని జాయిన్ చేయిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, విధేశీ యాత్రలు ఉచితంగా చేయవచ్చు అని గొలుసుకట్టు వ్యాపారం పేరుతో జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్ కుమార్ అమాయక ప్రజల నుండి డబ్బులు వసూల్ చేసినాడన్నారు.
ఇందులోని డబ్బులను క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తం లో లాబాలను ఆశించవచ్చు అని కస్తూరి రాకేష్ కుమార్ కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజు లతో కలిసి మూకుమ్మడిగా కొడిమ్యాలకు చేంధిన ముగ్గురు వద్ద నుండి సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసి వారికి మూడింతల లాభం వస్తుందని గోవా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు ఉచితంగా టూర్ పంపిస్తామని ఆశ చూపి ఎటువంటి డబ్బులు వారికి ఇవ్వకుండ మోసం చేశారన్నారు.
మేటా ఫండ్ ప్రో అనే అప్ ని కూడ క్లోజ్ చేయగా, పెట్టుబడి పెట్టిన అనేక మంది బాధితులు నష్టపోయారన్నారు. ఇందులో కొడిమ్యాల కు చెందిన బాధితురాలు కొడిమ్యాల పోలీస్ స్టేష న్లో ఫీర్యాదు మేరకు వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి తిరుపతిరెడ్డి, రాజు లను 8 న అరెస్ట్ చేసి కోర్ట్ కు పంపించడం జరిగిందన్నారు.
కీలకపాత్ర పోషించిన కస్తూరి రాకేష్ కుమార్ ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. రాకేష్ కుమార్ ను అరెస్ట్ చేసే సమయం లో ల్యాప్ ట్యాప్, లక్ష నగదు, ఏటీఏమ్, క్రెడిట్ కార్డ్స్, పాస్ బుక్ లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ తెలిపారు.
ప్రజలేవరు గొలుసు కట్టు వ్యాపారం పేరుతో క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి అధిక మొత్తంలో లాబాలను అందిస్తామని, విదేశీ టూర్లకు పంపిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
