పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.
16 తేదీ నుండి20 తేదీ వరకు నుండి 5 రోజుల ప్రత్యేక శిక్షణ
మెట్టుపల్లి సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ముందడుగు వేస్తూనే వుంది. ఈ క్రమంలో లోయర్ కోర్టులో పెండింగ్ కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్బీట్రేషన్ తరహాలోనే ప్రతి కోర్టులో మీడియాషన్ సెంటర్స్ ఏర్పాటుకోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ కి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది.
జాతీయ మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ మార్గదర్శకాల ప్రకారం అన్నీ జిల్లా యూనిట్ల పరిధిలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథరిటీస్ ఆధ్వర్యంలో అన్ని లోయర్ కోర్టుల్లో పెండింగ్ కేసుల లిస్టింగ్ చేయడంతో పాటు వాటి పరిష్కారం కోసం ఆయా కోర్టుల్లోనే మీడియాషన్ సెంటర్లని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వానికి ఆస్కారం ఉన్న కేసుల్ని ఇరుపార్టీల సహకారం తో సెటిల్/రాజీ చేయడానికి ఆసక్తి, అనుభవం మరియు నైపుణ్యం ఉన్న న్యాయవాదుల నుండి దరఖాస్తుల్ని స్వీకరించి ఎంపిక చేసారు. ఎన్నికైన న్యాయవాదులకు శిక్షణ అనంతరం, వారి వారి కోర్టు పరిధిలోనే మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రాజీకి సిద్దంగా మరియు అనుకూలంగా ఉన్న లిస్టింగ్ కేసుల్ని బదిలీ చేసి వాటి పరిష్కరానికీ కృషి చేస్తారు.
16 తేదీ నుండి20 తేదీ వరకు నుండి 5 రోజుల ప్రత్యేక శిక్షణ.
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, ధర్మపూరి లలో మొత్తం 5 జూనియర్ సివిల్ కోర్టులతో పాటు, 2 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉండగా, వీటిలో దాదాపు 600 కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరానికి ఆస్కారం ఉన్నట్టు జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గుర్తించారు. వీటి సత్వర పరిష్కరం కోసం ప్రస్తుతం జిల్లా కోర్టులో ఒక మీడియాషన్ సెంటర్ పనిచేస్తుంది. మెట్ పల్లి మరియు కోరుట్ల కోర్టుల్లో కూడా మీడియాషన్ సెంటర్లని ఏర్పాటుకి ప్రతిపాదనలు సిద్ధం చేయగా , మెట్ పల్లి నుండి సీనియర్ న్యాయవాదులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణుగోపాల్ మరియు పసునూరి శ్రీనివాస్ లని ఎన్నిక చేసారు. మీడియాషన్ సెంటర్ల నిర్వహణ పై వీరికి ఈ నెల 16 నుండి 20 వరకు కరీంనగర్ లో ప్రత్యేక శిక్షణ కు జగిత్యాల నుండి 10 మంది, కోరుట్ల నుండి 6, మెట్ పల్లి నుండి 4, ధర్మపురి నుండి ఇద్దరు ఎన్నికయ్యారు వీరికి ప్రత్యేకించి శిక్షణ ఇవ్వనున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం
