ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి
గాంధీ ఆవరణలో నానాటికి పెరుగుతున్న యాచకుల చావులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు):
గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యాచకుల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆసుపత్రి ఎదురుగా నిత్యం కొందరు పెట్టే అన్నదానంలో ఫుడ్డు తింటూ ఇక్కడే ఏండ్ల తరబడిగా తిష్ట వేసుకొని ఉంటున్న యాచకులు అనారోగ్యం బారిన పడి కొందరు, వయోభారం, మద్యానికి బానిసై కొందరు..ఇలా దాదాపుగా ప్రతినెలా పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వీరి వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో పోలీసులు ఈ డెడ్ బాడీలను నిబంధనల ప్రకారం గాంధీ మార్చురీలో మూడు రోజుల పాటు ఉంచి, తర్వాత అంత్యక్రియలకై జీహెచ్ఎమ్సీ కి అప్పగిస్తున్నారు. యాచకుల చిరునామా, వివరాలు ఏవీ లేకపోతుండటం పోలీసులకు తలనొప్పి గా మారుతోంది. గాంధీ ఆసుపత్రి ఎదురుగా అన్నదానాలు నిలుపుదల చేసి, యాచకులను ఆశ్రమాలకు పంపిస్తే ఈ అనాధ చావులకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఒక్కరోజే చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాలు కొల్పొయారు.
వివరాలు ఇవి.
1.గాంధీ ఆస్పత్రిలో అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు(54) ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు
2.గాంధీ ఆవరణలో పలు గాయాలతో ఉన్న యువకుడిని(27) చూసిన సెక్యూరిటీ సిబ్బంది గాంధీ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు అయితే సదరు గుర్తుతెలియని వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతూ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3.గాంధీ ఆవరణలోని 101 బిల్డింగ్ ఎదురుగా పడి ఉన్న దాదాపు 45–-50 ఏండ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించి భద్రపరిచారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
4.మైలార్ గడ్డ లోని బాలాజీ స్వీట్ హౌస్ వద్ద అనారోగ్యంతో కింద పడి ఉన్న దాదాపు 65–-70 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోలింగ్ సిబ్బంది గమనించారు గాంధీ ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించి భద్రపరిచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
