ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో ఇసుక రవాణాపై అవగాహన
కుల దూషణ ఘటనపై కేసు నమోదు
మెట్‌పల్లి ఆగస్టు 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా కలెక్టర్ అనుమతితో కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కోసం ఆత్మకూర్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రవాణాను ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు అధికారులు ఈ గ్రామసభ ద్వార వివరించారు.
మెట్పల్లి మండలం, ఆత్మకూర్ గ్రామంలో మంగళవారం రోజున గ్రామసభ నిర్వహించబడింది. ఈ సభకు మెట్‌పల్లి ఎం.ఆర్.ఓ., ఆర్.ఐ. సి.ఐ. మెట్పల్లి సిఐ వి. అనిల్ కుమార్,ఎస్.ఐ.పి. కిరణ్ కుమార్, . హాజరయ్యారు.
అలాగే ఈ మద్య మెట్పల్లి మార్కెట్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆత్మకూర్ గ్రామం నుండి ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్నందుకు గ్రామానికి చెందినా కొంత మంది వ్యక్తులపై అక్రమంగా కేసు నమోదు చేసినారని ఆరోపణలు వస్తున్న క్రమంలో, ఈ గ్రామా సభ ద్వార అధికారులు గ్రామా ప్రజలకి ఇసుక ట్రాక్టర్ లని అడ్డుకున్నదుకు కాకుండా, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కొంత మంది కులం పేరు తో దుషించినందుకు మాత్రమే కేసు నమోదు చేసినట్టు ప్రజలకి వివరించారు.
గ్రామ ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని, అలాగే ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని కోరారు.
కుల దూషణ ఘటనపై కేసు నమోదు
అలాగే, తేదీ 17.08.2025న ఆత్మకూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని కులం పేరుతో దూషించిన విషయంపై నిందితులపై కేసు నమోదు చేయబడింది. ఈ కేసును మెట్‌పల్లి డి.ఎస్.పి. దర్యాప్తు చేస్తున్నారు, మరియు ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నది, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)