గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు పూర్తి చేయాలి సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా
జగిత్యాల ఆగస్టు 21 ( ప్రజా మంటలు)
* వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు, సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డిఎస్పీలు, సి.ఐ లతో జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ ఉత్సవాలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎస్.ఐ లు, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండపాల్లో, శోభాయాత్ర లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు.
ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయoతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
*వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా లో పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం*
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం తో పాటు బైండోవర్ చేయడం జరిగింది అని తెలిపారు. కావున సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై ఎలాంటి అనుమానాలైనా సందేహాలైన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత ,లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.
ఈ యొక్క సమావేశం లో డి ఎస్పీలు రఘు చందర్, రాములు ,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ లు, అనిల్ కుమార్,సుధాకర్ ,కరుణాకర్ , పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
