బుగ్గారంలో జిల్లా వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీ
పరిసరాలను పరిశీలించిన జిల్లా వైద్యాధికారులు
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన
బుగ్గారం ఆగస్టు 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారులు మంగళ వారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
బుగ్గారం కు చెందిన ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం గత కొంత కాలంగా ధర్మపురిలో ఉంటున్నాడు. అక్కడ ఆయనకు జ్వరం సోకి తగ్గడం లేదు. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆవ్యక్తి జిల్లా ఏరియా ఆసుపత్రిలో, తర్వాత కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించు కుంటున్నారని తెలిసింది.
విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధికారి ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది బుగ్గారంలో కూడా మంగళ వారం ఆకస్మికంగా పర్యవేక్షించారు. బుగ్గారంలోని పలు ప్రాంతాలలో వారు స్వయంగా వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఇండ్లలోని వివిధ పాత్రల్లో, పాత కుండల్లో, కూలర్లలో నిలువ ఉన్న నీటిని, లార్వాలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రం చేయించి ఆయిల్ బాల్స్ వేశారు. దోమలను చంపేందుకు, తరిమి కొట్టేందుకు మందులు పిచికారి చేయించారు. గ్రామస్తులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అవగాహన కల్పించారు.
వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి అక్బర్ సమయ స్పూర్తితో వ్యవహరించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో, బావుల్లో బ్లీచింగ్ పౌడర్ వేశారు. దోమల సంహరణ కోసం రసాయనాలను స్ప్రే చేయించారు.
జిల్లా ఉప వైద్యాధికారి ఎన్. శ్రీనివాస్ తో పాటు కమ్యూనిటీ వైద్యాధికారి అల్లెంకి శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేష్, శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శి అక్బర్, ఎం.ఎల్.హెచ్. పి. నరేష్, ఏఎన్ఎం లు శైలజ, స్వప్న, హెల్త్ అసిస్టెంట్ శోభన్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)