వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే.
ఈ ఘటనలో- సుమారు 60 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తో అనారోగ్యానికి గురయ్యారు. - మృత్యువాతకు గురవుతున్న తెలంగాణ బిడ్డలు, విజ్ఞప్తులు, వినతిపత్రాలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తుకున్నా, ప్రజలు ధర్నాలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదంటూ గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆశ్రయించారు.
కేసు నంబర్ 318/36/19/2025 ను విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానాకు నోటీసులు జారీ చేసింది. వాంకిడి ఘటనపై నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు అడ్వకేట్ రామారావు తెలిపారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)