దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు):
పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సచివాలయం వద్ద ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేసి,బ్యాంకింగ్,టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు.
రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడిందని,రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళతామని, సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాం అని అన్నారు.
రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తాం.ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమని తెలిపారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
