ద్వితీయ భాషగా తెలుగు అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి ;- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

On
ద్వితీయ భాషగా తెలుగు అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి ;- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

స్టే ఇవ్వడానికి నిరాకరణ

 హైదరాబాద్ ఆగస్ట్ 08:

 ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును దశల వారీగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి, ఇతర జాతీయ బోర్డు పాఠశాలల్లో ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 7, 19 తేదీల్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాతక్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మొదట 6వ తరగతిలో తెలుగును ప్రవేశపెట్టి, క్రమంగా సంవత్సరానికి ఒక తరగతికి చొప్పున పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక్కసారిగా తప్పనిసరి చేస్తే.. ఇతర భాషల్లో చదివిన వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, పలు ప్రైవేటు పాఠశాలల్లో ఈ విధానం అమలవుతోందన్నారు. ప్రస్తుతం పిటిషనర్లు 6వ తరగతి నుంచి తెలుగును అమలు చేయకూడదంటున్నారని గుర్తుచేశారు. వాదనలను విన్న ధర్మాసనం తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags

More News...

National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...
Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ   జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ఉపాకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పంచగవ్యము స్వీకరించారు. కాండ ఋషుల హోమము రుషితర్పణము తదితర వైదిక క్రతువులు నిర్వహించారు .వైదిక క్రతువులను అన్యారంభట్ల...
Read More...
Local News  Crime 

పండుగ పూట విషాదం  నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు 

పండుగ పూట విషాదం  నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు  రాఖీ పండుగ పూట గ్రామంలో విషాదం (అంకం భూమయ్య)   గొల్లపల్లి ఆగస్టు 09 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో రాఖీ పండుగకు  బంధువులు  రాఖీలు కట్టిన అనంతరం భోజనం చేసి పడుకున్న యువకుడు నిద్రలోనే ప్రాణాలు విడిచిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని గరిగంటి అనిల్ (24) అనే యువకుడు రాఖీ...
Read More...
Local News 

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.  ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు...
Read More...
Local News 

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.   దేశ విదేశాల్లో సంప్రదాయ ఆచరణలు  (రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధ వచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి'...
Read More...
Local News 

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు)పట్టణ 17వ వార్డులో 10లక్షలతో , 18వ వార్డులో 10లక్షలతో సి సి రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  రక్షా బంధన్ సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల మాజీ...
Read More...
Local News 

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు) పట్టణ 25వ వార్డు లో 6 లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్డు ను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . వార్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించిన వార్డు సభ్యులు.వార్డు అభివృద్ధి పనులకు మరిన్ని...
Read More...