కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి
అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే ..
సికింద్రాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న కుట్రలను,దేశ ద్రోహపు చర్యలను బయటపెట్టాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి అంబేద్కర్ వాదులను కోరారు.మెట్టుగూడలో ఏర్పాటు చేసిన విలేఖరుల రాజేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ముస్లింల మెప్పుకోసం అత్యధిక సార్లు సవరించి అంబెడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని 1962లో భారత పార్లమెంటుకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ పై నెహ్రూ ఇంట్లో పనిమనిషిని పోటీకి దింపి అంబెడ్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడగొట్టి అడుగడుగునా అవమానించిన నీచమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 370 ఆర్టికల్,35(A),మైనారిటీ కమిషన్, వక్ఫ్ బోర్డు లాంటి అంశాలు లేవని అన్నారు. 1975లో భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండానే సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలను రాజ్యాంగ పీఠికలో బలవంతంగా చేర్పించి అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉంటే 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ప్రకటించి ఎందుకు ప్రధానం చేయలేదని ప్రశ్నించారు. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న ప్రధానం చేసి వారి చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆవిష్కరించి అంబేద్కర్ గారు పుట్టిన, చదివిన, మరణించిన ఐదు ప్రదేశాలను పంచ తీర్థాలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అంబెడ్కర్ గారికి అరుదైన గౌరవం ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26 రోజును రాజ్యాంగ దినోత్సవంగా అధికారికంగా జరిపించి అంబేద్కర్ గారి జయంతిని ఐక్యరాజ్యసమితి చేత ఆమోదింపజేసి ప్రపంచ విజ్ఞాన దినోత్సవం గా ప్రకటింపజేసిన ఘనత కూడా మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు.అందుకని దేశంలోని మేధావులు విద్యావంతులు అంబేద్కర్ వాదులు ఈ విషయాలను గమనించి రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని కుట్రలను అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలని అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)