నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 21
ప్రజా మంటలు
మల్యాల మండలంలో తాటి పెళ్లి, బల్వంతపూర్ గ్రామాలలో విద్యార్థులకు బీజేపీ నాయకులు,మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా విద్యా అధికారి రాము జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి లు మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివే సరస్వతీ పుత్రులందరికి కేంద్రమంత్రి బండి సంజయ్ అందిస్తున్న సైకిళ్లను పంపిణీ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే సరస్వతీ పుత్రులందరికీ , విద్యార్ధినీ, విద్యార్థులకు మోడీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్ల పంపణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దానిలో భాగంగానే మల్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను గురువారం రోజున అందించారని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
మల్యాల మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గురువారం రోజున సైకిళ్ల పంపిణీ చేశారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ముందుగా విద్యార్థిని విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ‘‘నరేంద్రమోదీ కానుక’’ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 20 వేల సైకిలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అందజేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దేవయ్య తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మొత్తం 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని , ఆ పిల్లలు తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక,ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జయసింహ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు. మండల అధ్యక్షులు గాజుల మల్లేశం. పిల్లి రాజశేఖర్. బొట్ల ప్రసాద్. రాచర్ల రాములు. సంఘని రవి కొను శ్రీనివాస్. హరీష్. కటకం హర్షవర్ధన్ వంశీ కొత్తూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
