నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
సైబర్ క్రైమ్, జిల్లా పోలీస్ ఆద్వర్యంలో స్పెషల్ ఆపరేషన్
- ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్.
- సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):
జిల్లాలోని కోరుట్లకు చెందిన బాదితుడు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసానికి గురై ఖాతా నుంచి 53 లక్షల రూపాయలు,జగిత్యాల పట్టణంకు చెందిన మరో బాదితుడు తన ఖాతా నుంచి 21 లక్షల రూపాయలు పోగొట్టుకోన్నారు.ఈ ఇద్దరు బాధితులు తాము మోసపోయామనే విషయం తెలుసుకొని, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికాగోయల్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డి.ఎస్.పి వెంకటరమణ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కోరుట్ల సీ.ఐ సురేష్, బుగ్గారం ఎస్సై సతీష్, సైబర్ క్రైమ్ SI లు కృష్ణ, దినేష్ కుమార్ మరియు సిబ్బంది స్పెషల్ ఆపరేషన్ లో పోలీస్ బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి లోతైన విచారణ చేసి, నిందితులను గుర్తించారు.
స్టాక్ మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు సైబర్ మోసానికి పాల్పడిన నిందితులకు చెందిన బ్యాంక్ ఖాతాలను కనుగొని, నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో ఉన్నట్లు గుర్తించి, పక్క ప్రణాళికతో అక్కడికి వెళ్లి, అదుపులోకి తీసుకోన్నారు.
ఒక్కొక్కరి ఖాతాను పరిశీలించి స్టాక్ మార్కెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసలను తెలుసుకోని ,ముగ్గురు నిందితులు కలకత్తాలో ఓ ముఠా ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లు గుర్తించారు.
నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
1.నాగేంద్ర ప్రసాద్ హెచ్.జి. గణేష్ శెట్టి కుమారుడు, వయస్సు: 45 సంవత్సరాలు, నివాసం: 07 సాయి సమృద్ధి అపార్ట్‌మెంట్స్, కొలుగు రోడ్, శ్రీనివాసపురం, యేలహంక, బెంగళూరు.*
బెంగళూరుకు చెందిన నిందితుడు నాగేంద్ర ప్రసాద్ సులువమైన మార్గాలను ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన సహచరుడు అన్వర్ సూచనలతో కలకత్తాలో గ్యాంగ్ సభ్యులతో కలసి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసగించడం ద్వారా వచ్చిన డబులను ఇతర ఖాతాలకు బదిలీచేసినట్లు విచారణలో తేలడం జరిగింది.ఇతని ఫై దేశవ్యాప్తంగా NCRP పోర్టల్ నందు 71 కేసులు నమోదుకావడం జరిగింది నిందితుని వద్ద నుండి మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ బుక్స్, చెక్ బుక్స్ స్వాదినం చేసుకోన్నారు..
2. యోగేష్ కదం డి. దశరథ రావు కుమారుడు, వయస్సు: 41 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, నివాసం: పివిసీ పెటింగ్/o 9వ మెయిన్, మారుతి లేఅవుట్, దశరథాళి, ఉత్తర బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం.*
3. సునీల్ ఎస్.కె. శివకుమార్ కుమారుడు, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి (సోలార్ కనెక్షన్ వద్ద), నివాసం: చిన్నకన్న లేఅవుట్, హెన్యూర్ క్రాస్, నార్త్ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం*
ఈ ఇద్దరు నిందితులు జల్సాలు చేయడానికి డబ్బులు సులభంగా సంపాదించాలని ఉద్దేశంతో మరి కొంతమంది వ్యక్తులతో కలిసి ఇతరుల పేర్ల పైన, వీరి పేర్ల పైన బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, బ్యాంక్ ఖాతాలను సైబర్ నెరగాళ్లకు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బులను జల్సాలకు ఉపయోగించుకునేవారు.
వీరి పైన దేశవ్యాప్తంగా NCRP పోర్టల్ నందు 22 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ బుక్స్, చెక్ బుక్స్ స్వాదినం చేసుకోవడం జరిగింది. నిందితులను రిమాండ్ కు పంపారని ఎస్సీ అశోక్ కుమార్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
