మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

On
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు

జగిత్యాల ఆగస్ట్ 20 (

ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి దేశంలో  పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ .
కలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ఆనాటి ప్రధాని దేశ సమగ్రత సమైక్యత కొరకు పాటుపడుతున్న సందర్భంగా బలి కావడం ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని యావత్ ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నవ తరానికి యువతకు ప్రాధాన్యత కల్పించే విధంగా రూపకల్పన చేశారు

భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింప చేయడానికి భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడే అడుగులు వేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుంది

దేశంలోని కోట్లాదిమంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింపిప చేయడానికి ఆనాడే సాన్ ఫిట్రోడను సలహాదారుడిగా నియామకం చేసుకొని నాంది పలకడం జరిగింది

అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా 21 సంవత్సరాల వరకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదింపు చేసి 18 సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు

రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఆనాటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలను అనుగుణంగా ప్రజాస్వామ్య హక్కులు నిలబెట్టే విధంగా పార్టీ ఫిరాయింపులను అరికట్టడం కొరకు దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపికైనటువంటి అభ్యర్థి అదే పార్టీలో కొనసాగే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో రాజీవ్ గాంధీ రూపొందించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది

స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటు నిధులు కూడా సమకూర్చబడాలనే ఆలోచనతోని ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి మనకు కేంద్రం నుండి లభించే గ్రాండ్స్ అన్నిటికీ రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ యే.

బలహీన వర్గాలకు స్థానిక సంస్థలలో 33% ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా చట్టంలో మార్పులు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ కి దక్కుతుంది

అటువంటి మహాత్ముడు ప్రపంచ శాంతిని కోరడంలో భాగంగా శ్రీలంక మన పోరుగు దేశంలో శాంతిని నెలకొల్పాలని తపనతోని తీసుకున్న చర్యలతో ఏ విధంగా కలుస్తాను ఉగ్రవాదులు ఆనాడు ఇందిరా గాంధీ ని బలి తీసుకోవడం జరిగిందో అదే విధంగా శ్రీలంక ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని బలి తీసుకోవడం జరిగింది

దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగాలు చేశారు కానీ దేశ స్వాతంత్ర అనంతరం ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తులు  కేవలం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ  లు మాత్రమే.

అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలి

ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కార్యరూపం దాల్పింపచేయడమే మన వంతు బాధ్యత భావించాలి

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ...

అపాయం ఉన్న లెక్కచేయకుండా దేశ సమగ్రతకు సమైక్యతకు దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనిది

రాజీవ్ గాంధీ  ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలని కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా రాణిస్తుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతోని కంప్యూటర్ యుగం యొక్క వ్యవస్థను సంస్కరణ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే గుర్తించారు

రాబోయే రోజులలో భారతదేశ దేశాలకు దీటుగా ఉండాలని అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఆ కమ్యూనికేషన్ వ్యవస్థతో భారతదేశం అగ్రగామిగా ఉన్నది

ఈరోజు గ్రామీణ ప్రాంతం స్థానిక ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లకు పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామపంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్లాలని చట్టాన్ని చేసి అధికారమిచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు

బి ఆర్ అంబేద్కర్ గారు అందించిన  భారత రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ

ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి ఆరోజు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు భారతదేశ ప్రజలకు రైతాంగానికి గొప్ప గొప్ప ప్రాజెక్టులు శ్రీశైలం , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు రూపకల్పన చేసిన గొప్ప నాయకులు

ఇందిరా గాంధీ  గరీబ్ హటావో రాజీవ్ గాంధీ  యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థను ఇతర దేశాలకు దీటుగా భారతదేశం ఉండే విధంగా రూపకల్పన చేశారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివను అన్నారు.

జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ కాంగ్రెస్ నాయకులు బండా శంకర్, మాజీ కౌన్సిలర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...
Local News  Spiritual  

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు)): శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ఉత్సవ ప్రచార రథాన్ని డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాలు తేదీ:20-08-2025 బుధవారం  నుండి 23-08-2025 శనివారం  వరకు జరుగురాయని ఆలయ కమిటీ ప్రకటించింది. డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్  అమ్మవారుకు ప్రత్యేక పూజలు...
Read More...
National  State News 

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం ముంబై ఆగస్టు 19: ముంబైలోని మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో, ఈ సాయంత్రం (ఆగస్టు 19) భారీ వర్షాల మధ్య నడుస్తున్న మోనోరైలు ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో కదులుతుండగా అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది....
Read More...
State News 

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో-  సుమారు 60...
Read More...
Local News 

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే .. సికింద్రాబాద్,  ఆగస్టు 19 (ప్రజా మంటలు):  రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని  రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న...
Read More...
Local News  State News 

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్...
Read More...

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి    వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
Read More...