వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్
విజయవాడ ఆగస్టు 20:
2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సూచనగా వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంత మంచి అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో నటినటులుగా కొనసాగిన వారు మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని అనంతరం రాజకీయాలలోకి వెళ్తున్నారు. అలా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సెలబ్రిటీలు రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించిన సంగతి తెలిసిందే. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది రాజకీయాలలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో చిరంజీవికి గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేసిన ఈయన కొన్ని కారణాలవల్ల అవకాశాలను పూర్తిగా కోల్పోయారు. అయితే హీరోగా కాకుండా సపోర్టింగ్ పాత్రలలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈయన పలు కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.అనంతరం సుమన్ రాజకీయాల గురించి సినిమాల గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని తెలియజేశారు . దైవ సంకల్పంతో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన స్వయంకృషితో సుమారు 800 సినిమాలలో నటించానని తెలిపారు.
అయితే రాజకీయాలలోకి కూడా రావాలని భావిస్తున్నానని ఆ భగవంతుడి దయ ఉంటే కచ్చితంగా రాజకీయాలలోకి వస్తానని సుమన్ ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు.ఇక 2029 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో మాత్రం తాను కచ్చితంగా పోటీ చేస్తానని వెల్లడించారు.ఇలా ఈయన 2029 ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పడంతో ఏ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయబోతున్నారనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక పలు సందర్భాలలో ఈయన రాజకీయ అంశాల గురించి మాట్లాడినప్పటికీ, ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు..
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)