భారీ విగ్రహాల తరలింపులో విద్యుత్ వైర్లను తాకవద్దు - వినాయక మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి- ఏడిఈ మనోహర్
మెట్పల్లి ఆగస్టు 21 ( ప్రజా మంటలు):
భారీ వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ హెచ్టీ లైన్ తాకకుండా అప్రమత్తంగా ఉండాలని మెటుపల్లి ఏడీఈ మనోహర్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు
. రాబోయే వినాయక చవితి సందర్భంగా పలు చోట్ల మండపాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు వినాయక విగ్రహాలు ఖరీదు చేసి గమ్య స్థానాలకు తరలించే ప్రక్రియలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా 20 అడుగుల పైగా ఎత్తున్న విగ్రహాల రవాణా కష్టంగా మారింది. విద్యుత్ లైన్ల క్రాసింగ్ ఉన్నచోట వైర్లను తప్పించడానికి వెదురు బొంగులతో ప్రయత్నం చేయడం వల్ల కొన్నిసార్లు షాక్ కు గురై మరణించిన సందర్భాలు ఉన్నాయి.
ఒకవేళ అలాంటి సందర్భాల్లో వైర్ల జోలికి వెళ్లకుండా, విద్యుత్ శాఖ స్థానిక సిబ్బందికి సమాచారం అందిస్తే వాహనం దాటే వరకు ఆ ప్రాంత సరఫరా నిలిపి వేసి సహకరిస్తారు. గతంలో మే 15 న కోరుట్ల లో ఇద్దరు, ఆగస్టు 17 న రామంతాపూర్ లో 6గురు, ఆగస్టు 18 న కామారెడ్డి లో ఒకరు మృత్యుబారిన పడిన విషయం పరిగణన లోకి తీసుకొని జాగ్రత్తలు వహించాలి. అందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకరించడానికి అందుబాటులో ఉన్నారు.
విద్యుత్ లైన్ల పై యువకులకు అవగాహన అవసరం
ముఖ్యముగా విద్యుత్ నెట్వర్క్ మూడు రకాల లైన్లతో కూడుకొని ఉంటుంది. 33కేవీ, 11కేవీ మరియు ఎల్టీ లైన్లు. వాటి ఓల్టేజీని బట్టి ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. అన్నీ ఒకే రకమైన లైన్లు అని భావించి కర్రలతో ఎత్తే ప్రయత్నిస్తే 33కేవీ, 11కేవీ లైన్లలో మాత్రం తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా విగ్రహాల రవాణా చేస్తే అకారణంగా మరణాలు సంభవించి వారి కుటుంబాల్లో తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
