గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి
వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :
రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మంగళవారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలసి మంత్రి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఇటీవల పత్రికల్లో గాంధీ ఆసుపత్రి గురించి చాలా వార్తలు వస్తున్నాయని, అసలు గాంధీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ రోజు గాంధీకి వచ్చినట్లు మంత్రి అన్నారు.
ఈసందర్బంగా ఓపీ బ్లాక్ లోని పలు వైద్య విభాగాలను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం గురించి, వైద్య పరికరాల పనితీరు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా వైద్య విభాగాల వద్ద ఉన్న ఔట్ పేషంట్లతో వారి ఆరోగ్య పరిస్థితి, తదితర అంశాల గురించి మాట్లాడారు. ఎంసీహెచ్ బిల్డింగ్ కు వెళ్ళి ఐవీఎఫ్ సెంటర్ సందర్శించి, కేసుల పురోగతి గురించి డాక్టర్లను అడిగారు. అనంతరం గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, గాంధీ లోని వైద్య విభాగాల హెచ్ఓడీలతో కలసి సమావేశమై, రివ్యూ నిర్వహించారు. సమావేశంలో గాంధీలోని సమస్యలు, వైద్య పరికరాల కొరత, పేషంట్ల కు అందుతున్న వైద్యం,డ్రైనేజీ,తదితర అంశాలపై మంత్రి సుదీర్షంగా చర్చించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సిబ్బంది సమస్యల పరిష్కారంపై అధికారులతో ఈ రోజు చర్చించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని డ్రైనేజీ వ్యవస్త ప్రక్షాళన, ఎలక్ర్టిసిటీ రిపేర్లు, ఫైర్ ఎక్విప్ మెంట్, ఎస్టీపీలు, నర్సింగ్ సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఒకే ప్లోర్ లో ఉండాలనే ఆలోచన ఉందని, ఈమేరకు వీటిలోని సాధకబాధకాలు పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. తెలంగాణ లో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిందన్నారు. మానవ వనరులతో పాటు మెడికల్ ఎక్విప్ మెంట్ పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. 12 మంది బయోమెడికల్ ఇంజనీర్ లు అవసరం ఉందని, ఈ పోస్టులను క్రియేట్ చేస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గాంధీలో వివిద పనులు చేయడానికి ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్,ఎన్టీపీసీ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. పేషంట్ల అటెండర్ల కోసం పర్మినెంట్ స్ర్టక్చర్ ఏర్పాటు చెయ్యాలని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రూ.ఐదు కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలోనే మొదటి ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ గాంధీ ఎంసీహెచ్ లో చక్కగా పనిచేస్తుందని, ఇప్పటివరకు 23 కేసులను ఎంపిక చేశామని, ఇందులో రెండు పాజిటివ్ రిజల్ట్ వచ్చాయన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లకు ధీటుగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల సేవలను పెంచడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఐయూఐ కింద ఆరు కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ బిల్డింగ్ ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు.
గాంధీ లో ప్రస్తుతం 2016 బెడ్లు ఉన్నాయని, ఈ సంఖ్యకు అనుగుణంగా వసతులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలోనే కాకుండా ప్లేట్ల బురుజు లో కూడ ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో కొండాపూర్ లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలో మొత్తం 379 ఐవీఎఫ్ సెంటర్లు ఉంటే ఇందులో 150 కి పైగా ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనాలకు విరుద్దంగా సెంటర్లు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గాంధీ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నాలుగు నెలల పెండింగ్ జీతాలను ఇస్తామన్నారు. డీఎంఈ డా.నరేంద్రకుమార్, రాష్ర్ట వైద్య, విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్, ఫ్యామిలీ ఆండ్ వెల్ఫేర్ డైరెక్టర్ ఎస్.సంగీతా, డీఎంహెచ్వో డా.వెంకటి, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)