రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూలై 31:
రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద యువకుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.52 లక్షలు సాయం అందించి అండగా నిలిచారు.
ధర్మపురికి చెందిన అక్కనపల్లి రాజు అనే యువకుడు 5 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురవడంతో బ్రెయిన్ సర్జరీ చేయించారు. ప్రస్తుతం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
రాజు తండ్రి 5 ఏళ్ల క్రితం మరణించగా తల్లితో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా, వీరి దీన స్థితిని గమనించిన ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి జూలై 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. ఎన్నారై లు, ఇతర దాతలు రూ.1.52 లక్షలు విరాళాలు రాజు తల్లి అంజలి బ్యాంక్ ఖాతాకు పంపించారు. వాటిని స్థానిక సి ఐ రాం నర్సింహారెడ్డి బాధిత కుటుంబాలకి ఎస్సై ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాధవ రావ్ తో కలిసి పంపిణీ చేశారు. దాతల సాయంతో వైద్యం చేయిస్తారని రమేష్ తెలిపాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Title

సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, సామూహికంగా మహిళలచే కుంకుమార్చన పూజలు

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత
