ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మాట్లాడుతూ ప్రధానిగా వారు చేసిన సేవలు కంప్యూటర్లు,టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశ పెట్టడంతో పాటు,స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారను వక్తలు పేర్కొన్నారు.
ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాషా గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారావు మాజీ సర్పంచులు ఈర్నాల రాజేశ్వర్ కసారపు అరవింద్ గౌడ్ పురంశెట్టి వెంకటేశం రేవెళ్ళ సత్యనారాయణగౌడ్,మాజీ దాసరి తిరుపతి, కొండ వెంకటేష్ గౌడ్ అవునూరి శ్రీధర్, కస్తూరి హరికిరన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సట్ట ఎల్లయ్యా రామ్మోహన్ రెడ్డి, గురిజాల బుచ్చిరెడ్డి, చెవులమద్ది గంగాధర్ చిర్ర దిలీప్, తూర్పటి అంజి,తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
