ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ సుదర్శన్ రెడ్డి
Breaking news
రెండు సిద్ధాంతాల, భావజాలాల పోటీ?
తెలంగాణ వాది - తెలంగాణ బిడ్డ
21న నామినేషన్ వేయనున్న రెడ్డి
న్యూ డిల్లీ ఆగస్ట్ 19:
I.N.D.I.A. బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ SC న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. రెడ్డి భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు గోవా మొదటి లోకాయుక్త.ప్రజాతంత్రవాది, ప్రగతిశీల భావాలతో అన్ని వర్గాలలో పేరున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
ప్రగతిశీల భావాలున్న,తెలంగాణకు చెందిన వ్యక్తిని పోటీలో నిలపడం వల్ల, దక్షిణాది నుండి NDA పోటీలో ఉంచిన తమిళ నాడు RSS అభ్యర్థికి, పోటీగా సమ ఉజ్జిని దింపినట్లు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
రెండు సిద్ధాంతాల, భావజాలాల పోటీ?
ఇది ఒక రకంగా రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా మారిపోతుంది. RSS భావాలకు పూర్తి వ్యతిరేక భావాలున్న సంక్షేమ వాడి సుదర్శన్ రెడ్డి పోటీ ఫలితాలు ఎలా ఉన్నా, దేశమంతా మళ్ళీ కుడి - ఎడమ భావజాలాల చర్చకు తెర లేపినట్లయింది.
బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి (జననం 8 జూలై 1946) ఒక భారతీయ న్యాయవాది, అతను 2007 నుండి 2011 వరకు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] ఆయన 2025 ఎన్నికల్లో భారత ఉపరాష్ట్రపతి పదవికి భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (INDIA) అభ్యర్థిగా ఎంపిక చేశారు.
తెలంగాణ వాది - తెలంగాణ బిడ్డ
బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి జూలై 8, 1946న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, ఆకుల మైలారంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లో చదువుకుని 1971లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అదే సంవత్సరం ఆయన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)