రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు
జాతీయ బిసిసంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవ్ రామ్
మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు
గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవ్ రామ్ అన్నారు.
తెలంగాణలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో భూములను కొల్లగొట్టి రైతులను మోసగించినారు వ్యవసాయ భూములను రైతులకు తెలవకుండా రికార్డులలో వేరే వారి పేర్లు నమోదు చేయించి అసలు పట్టాదారు కు హక్కులు లేకుండా చేసినారు వారి ఉసురు తగిలి టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది ఎన్నికల టైములో రేవంత్ రెడ్డి దండుగ మల్ల ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు భూభారతి తెచ్చి అన్ని వ్యవసాయ భూముల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మంచి మార్గం వేసినారని,వారి అభినందించాలి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయకమైన పేద బీద రైతులను పైరవీకారులు మోసం చేయకుండా వారి అన్ని రకాల పనులు తాసిల్దార్ పర్యవేక్షణలో వారి యొక్క భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవు సంవత్సరాల తరబడి రైతులు కష్టపడవలసిన అవసరమాతుంది కాబట్టి రైతు సమస్యలను స్థానిక తాసిల్దారే పరిష్కరించే విధంగా గెజిట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి భూభారతి గెజిట్లో కొన్ని అంశాలను కలెక్టర్లు ఆర్డీవోలు పరిష్కరిస్తారనడం మళ్లీ కెసిఆర్ యొక్క అడుగుజాడల్లో నడిచినట్లు అవుతుంది రైతులకు సులభతరమైన మార్గాన్ని వెయ్యాలి తప్ప తాసిల్దార్ తర్వాత ఆర్డీవో ఆ తర్వాత కలెక్టర్ అని పేర్కొనడం సబమైన నిర్ణయం కాదు రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగాలి రైతులకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం జరగాలి విచారణ పేరుతో కాలయాపన చేసే అధికారులను వెంటనే సస్పెండ్ చేయడానికి జీవోలు జారీ చేయాలి వీఆర్వో వ్యవస్థలను పునరుద్ధరణ చేసే సమయంలో విద్యావంతులైన యువతి యువకులకు అవకాశాలు ఇవ్వాలి రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతిపరులను వేరువేయాలి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు చూడాలి భూభారతి మార్గదర్శకాలను ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అలాగే రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించాలి పేదవారు భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజులు ప్రభుత్వాలు భారీగా వసూలు చేస్తున్నాయి వీటిని వెంటనే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది ఎన్నో ఏళ్ల నుండి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగం రాజకీయ పార్టీలు తెచ్చే రైతులకు మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పే చట్టాలను నమ్మి రైతులు మోసపోతున్నారు అలా కాకుండా భూభారతి పైననే రైతులు చాలా ఆశలు పెంచుకున్నారు పెట్టుకున్నారు ఎన్నో ఏళ్ల నుండి ఉన్న సమస్యలు పరిష్కారం కావడానికి భూభారతి ఉపయోగపడుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం వివిధ కోట్లలో ఉన్న భూ సమస్యలను భూభారతి పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డిఓ స్థాయిలో పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు చేకూర్చిన వారు అవుతారు కోర్టులలో ఉన్న భూతగాదాలను ఎన్నో ఏళ్లు పరిష్కారం కాకుండా కోర్టులలోనే భూమి కేసులు తేదీలు ఇచ్చుకుంటూ భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు.
ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వలన భూ సమస్యదారులు వృద్ధులై మరణిస్తున్నారే తప్ప మట్టి భూమి వలన వారు లాభపడింది ఏమీ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టులలో గల భూ సమస్యలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఆర్డీవో ఆఫీస్ ద్వారా భూ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కోర్టులలో మూలుగుతున్న కేసులను 90 రోజులలో పరిష్కారం అయ్యేలా అన్ని భూమి కేసులను ఆర్డిఓ పరిధిలోకి తీసుకురావడానికి ప్రత్యేకమైన జీవో విడుదల చేసి సత్వర పరిష్కారం చేయడానికి కృషి చేయాలి భూ సమస్యల సివిల్ కేసులలో ఎలాంటి వాయిదాలు లేకుండా అన్ని ఫైల్స్ క్లియర్ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి కోర్టులలో ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారంగా అన్ని రకాల భూమి కేసులను వెంటనే రెవెన్యూకు బదులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం .
కోర్టులలో కేసులు వేసుకొని రైతులు ప్రజలు ఎలాంటి న్యాయం జరగకుండా కాలాతీతం అవుతుంది అయినా ఎలాంటి న్యాయం జరగడం లేదు అలాంటి కేసులను తక్కువ టైంలో పరిష్కారం అయ్యేలా భూ సమస్యలపై ప్రత్యేక ఆర్డీవో నియమించాలి వాటిని పరిష్కరించి పేదవారికి న్యాయం జరిగేలా చూడాలి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములను డిజిటల్ సర్వే చేయించి హద్దు రాళ్లు పాటించాలి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భూ సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం . ఈ భూభారతి వలన ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి నిర్ణయము చాలా అద్భుతమైన సహా సోపేతమైన ది గా అభివర్ణిస్తున్నాం అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
