చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం
డీజీపీ డాక్టర్ జితేందర్
సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు):
13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ తన 23వ లైబ్రరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి డాక్టర్ జితేందర్ ఆకర్షణను అభినందించారు. ఈ కొత్త లైబ్రరీలో ఇంగ్లీషు తెలుగు హిందీ భాషలలో మొత్తం 575 పుస్తకాలు సేకరించబడి ఉంచినట్లు ఆకర్షణ తెలిపారు.
2021లో ఆకర్షణ కేవలం తన తొమ్మిదేళ్ల వయసులోనే ఓపెన్ లైబ్రరీ ఏర్పాటు చేయడం ప్రారంభించిందని, ఇప్పటివరకు 23 లైబ్రరీలను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ సేవా భావానికి భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి పంటి జాతీయ నాయకులు నుంచి గుర్తింపు పొందిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరిలో ప్రారంభించనున్న మెట్రో లైబ్రరీ ప్రాజెక్టు ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయం చైర్ పర్సన్ భారతీ దేవి, బాలికలు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
