వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
జగిత్యాల జూన్ 17:
వయో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర రాజ నర్సింహకు వినతిపత్రం అందించామని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా రావు ఆధ్వర్యంలో వయోవృద్ధులు కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో ఒత్తిడులకు గురవుతున్నారని ,ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించడానికి ఒకే చోట వివిధ వ్యాధులకు చికిత్స అందేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వయోధికులకి ప్రత్యేక చికిత్స వార్డులు ఏర్పాటు చేసి ఉచిత వైద్యసేవలు అందించాలని,ఈ వార్డుల్లో జనరల్ మెడిసిన్, సర్జరీ,నేత్ర,చెవి,ముక్కు, దంత,గొంతు,మానసిక,నరాలకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకి ఇన్ పేషంట్లుగా ఉచిత వైద్య చికిత్సలు అందించాలని మంత్రిని కోరామన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు,రాష్ట్ర ,జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
