ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు
దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) :
ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు వ్యక్తిగత పనులకన్నా ఉద్యోగుల సంక్షేమం కొరకు ఎక్కువగా పని చేస్తారని కార్మికుల కోసం పని చేసే చరిత్ర ఉన్నది కాబట్టే మజ్దూర్ యూనియన్ ను కార్మికులు మొదటి స్థానంలో గెలిపించారని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు . బుధవారం సికింద్రాబాద్ లోని ఎస్సీఆర్ఎమ్యూ కార్యాలయంలో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ..నిజాయితీతో నిరంతరం పని చేసే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శంకర్ రావు తనకు ఆదర్శం అని అన్నారు. ఉద్యోగుల పని తీరుతోనే ఇండియన్ రైల్వేలో సికింద్రాబాద్ జోన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు.మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ పదవి విరమణ సందర్బంగా అభినందన సత్కార సభ జోనల్ వ్యాప్తంగా తరలి వచ్చి జనరల్ మేనేజర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న మజ్దూర్ యూనియన్ నాయకులు మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర కార్యాలయ లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పదవి విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను ఘనంగా పూలమాల బొకేలతో సత్కరించారు. మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ డాక్టర్ శంకర్ రావు మాట్లాడుతూ అరుణ్ కుమార్ జైన్ సేవలు మరువలేనివి అని అన్నారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ జోన్ అగ్రగామిగా నిలిపారని అన్నారు. రైల్వే ఉద్యోగుల సౌకర్యార్థం స్పెషల్ వార్డుల ఏర్పాటు, క్యాతలిక్ ల్యాబులు, 20 గెస్ట్ రూముల నిర్మాణం చేపట్టారని అన్నారు సికింద్రాబాద్ జోన్ లో సుమారు 15 వేలకు పైగా నూతన ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత అరుణ్ కుమార్ జైన్ కు దక్కిందన్నారు. తిరుపతి లో కల్యాణ మండపం ఏర్పాటు నిధులు మంజూరు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ నీరాజ్ అగర్వాల్, జనరల్ మేనేజర్ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎలక్ట్రీకల్ ఇంజినీర్ బ్రీజ్ మోహన్ మీనా, ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మల రాజారామ్, ప్రిన్సిపాల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా ఠాగూర్, ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్దార్ధ,మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ ఉదయభాస్కర్, రామకృష్ణ, భారటే, శ్రీనివాస్ రెడ్డి జోనల్ కోశాధికారి సరోజినీ రెడ్డి సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, హైదరాబాద్ డివిజనల్ కృష్ణ, విజయవాడ డివిజనల్ సెక్రెటరీ లీలా, వర్క్ షాపు డివిజనల్ సెక్రెటరీ బుచ్చి రెడ్డి, నాందేడ్ డివిజనల్ సెక్రెటరీ మాణికుమార్, ఈడీబీ డివిజనల్ సెక్రెటరీ సంజీవయ్య సిసియాస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి వైస్ ప్రెసిడెంట్ రాంమ్మోహన్ లతో పాటు పలువురు మజ్దూర్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
